ఆగస్టు 7…జాతీయ చేనేత దినోత్సవం

263
KTR gifts handloom clothes to netas
- Advertisement -

ఆగస్టు 7న అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరపాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.  చేనేత వస్ర్తాల నేత, డైయింగ్ ప్రక్రియలను నేరుగా తెలిపేలా లైవ్ డెమోల ఎర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులకు లేఖ రాసిన కేటీఆర్  చేనేత దినోత్సవాన్ని చేనేత వస్ర్తాల ప్రచారానికి ఉపయోగించుకోవాలన్నారు. దేశ అర్ధిక, సామాజిక రంగాల్లో చేనేత పరిశ్రమ భాగస్వామ్యాన్ని తెలిపేందుకు, చేనేతలకు ప్రచారం కల్పించి, నేతన్నల అధాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో అగస్టు 7 వ తేదిని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని తెలిపిన మంత్రి, ఈ మేరకు గత రెండు సంవత్సరాలుగా మన రాష్ర్టంలోనూ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ర్టంలో ఈ సంవత్సరం మరింత ఘనంగా, ప్రజలకు చేనేత వస్ర్తాల, పరిశ్రమ గురించి అవగాహన నింపేలా జరపాలని మంత్రి లేఖలో ప్రజా ప్రతినిధులు, అధికారులకు విజ్జప్తి చేశారు.

KTR gifts handloom clothes to netas
వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన చేనేత పరిశ్రమ రాష్ట్రంలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాది కల్పిస్తున్నది మంత్రి తెలిపారు. ఈ లేఖలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం గత నెలలోనే శాస్ర్తీయంగా సర్వే నిర్వహించి 17వేల మగ్గాలను గుర్తించడం జరిగిందని, ఈ సర్వే తర్వతా ముఖ్యమంత్రి అలోచనల మేరకు టెక్స్టైల్స్ మరియు చేనేత శాఖ తరపున అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. చేనేతల అదాయం పెంచడం లక్ష్యంగా, వారిని వారి కాళ్ల మీద నిలబడేల చేసేందుకు నేతన్నకు- చేనేత పొదుపు పథకం, యార్న్ సబ్సీడీ, పావలా వడ్దీ పథకం, బ్లాక్ లెవెల్ క్లస్టర్లు ఎర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. దీంతోపాటు చేనేత వస్ర్తాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వ అధికారులకు పిలుపునిచ్చి, తాను స్వయంగా ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలను దరించడం జరుగుతున్నదని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంగా గత శాసన సభ సమావేశాల్లో  ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలకు  చేనేత వస్ర్తాలను కిట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ప్రజా ప్రతినిధుల భాగసామ్యాన్ని మంత్రి కోరారు. ఈ మేరకు వచ్చే నెల 7 తేదిన జరగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో ఘనంగా జరపాలని కోరారు. ఇందుకోసం పలు కార్యక్రమాలను చేపట్టి, విజయవంతం చేయాలన్నారు. అయా జిల్లాలో ఉన్న చేనేత  సంఘాలు, కమిటీలు, సొసైటీల ప్రతినిధులకు అహ్వనం పంపాలని  జిల్లా కలెక్టర్లను కోరారు. వీటితోపాటు చేనేత రంగంలో జాతీయ అవార్డు గ్రహీతలు, ప్రముఖ చేనేత కార్మికులు, డిజైనర్లుకు సన్మానం చేయడం, చేనేత వస్ర్తాల స్టాల్స్ ఎర్పాటు చేయాలన్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ చేనేత వస్ర్తాలను ధరించి “చేనేత రన్/ ర్యాలీలు” తీయాలన్నారు. జిల్లాల కేంద్రాల్లో చేనేత వస్ర్తాల నేత, డైయింగ్ ప్రక్రియలను నేరుగా తెలిపేలా లైవ్ డెమోల ఎర్పాటు చేయాలన్నారు. చేనేత పరిశ్రమ, వస్ర్తాల పైన  విద్యార్ధులకు పోటీల ఎర్పాటు చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుని చేనేత దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి లేఖలో కోరారు.

- Advertisement -