సూర్యాపేటకు కేటీఆర్..

24
- Advertisement -

సూర్యపేట జిల్లా కేంద్రంలో జరిగే బీఆర్ఎస్ సభకు హాజరుకానున్నారు కేటీఆర్. ఏప్రిల్ 27 న వరంగల్ లో పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో జిల్లా ల వారిగా ముఖ్యకార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు కేటీఆర్.

ఈ సందర్భంగా 20న సూర్యపేట జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ,జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరుకానున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

జిల్లా లోని సూర్యపేట ,తుంగతుర్తి హుజుర్నగర్ ,కోదాడ నియోజకవర్గ లాల నుండి ముఖ్య కార్యకర్తలు నాయకులు హాజరుకానున్నారు. KTR కి గ్రాండ్ వెల్ కం తెలిపేల సూర్యపేట టౌన్ లో రేపు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు కార్యకర్తలు.. సూర్యపేట టౌన్ లోని జనగామ క్రాస్ రోడ్ నుంచి బస్ స్టాప్ ,కోర్టు, జూనియర్ కాలేజీ మీదుగా సమావేశానికి వచ్చేలా ఈ బైక్ ర్యాలీ ప్లాన్ చేశారు జగదీష్ రెడ్డి. పట్టణం మొత్తాన్ని గులాబీ తోరణాలతో, జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

Also Read:వేసవి రిలీజ్ సినిమాల లిస్ట్ ఇదే!

- Advertisement -