KTR:కోయంబత్తూరుకు కేటీఆర్

6
- Advertisement -

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రేపు కోయంబత్తూర్ కి వెళ్ళనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు పాల్గొనే ప్రతిష్టాత్మకమైన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ కాంపిటీషన్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన రేపు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనుంది.

దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీలలో కేటీఆర్ పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నారు. యువతలో ఆవిష్కరణా దృక్పథం, టెక్నాలజీ ప్రోత్సాహం, మోటార్‌స్పోర్ట్స్‌ రంగంలో కొత్త ప్రతిభను వెలికితీసే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుంది.

Also Read:జోర్డాన్‌లో వలస కార్మికుల ఆవేదన

- Advertisement -