అంతర్జాతీయ సదస్సులకు కేటీఆర్‌

240
Ktr for America
- Advertisement -

తెలంగాణ పరిశ్రమలు, ఐటి , పురపాలక, ఎన్నారై శాఖ మంత్రి కెటి రామమారావు మరో అంతర్జాతీయ సదస్సుకు ప్రత్యేక అహ్వనాన్ని అందుకున్నారు. ప్రపంచ పర్యావరణ మరియు నీటి వనరుల కాంగ్రెస్ కు హజరు కావాల్సిందిగా మంత్రిని  the American Society of Civil Engineers’ Environmental and Water Resources Institute (ASCE-EWRI) కోరింది. వివిధ ప్రపంచ దేశాల నుంచి సూమారు 1000 మంది నీటి, పర్యావరణ నిపుణులు హజరయ్యే ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ఇవ్వాలని కోరారు.

కాలిఫోర్నియాలోని సాక్రమెంటో నగరంలోని సాక్రమెంటో కన్వేన్షన్ సెంటర్ లో జరిగే ఈ పదిహేడవ కాంగ్రెస్  (సదస్సు)లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ నీటి సరఫరా పథకంతో పాటు నీటి మౌళిక వసతుల కల్పన(వాటర్ ఇన్ ప్రాస్రక్టర్) ద్వారా కలిగే ఫలితాల పైన మాట్లాడాల్సిందిగా మంత్రిని కోరారు. మే నెల 21 నుంచి 25 తేది వరకు జరిగే ఈ అంతర్జాతీయ కాంగ్రెస్‌లో మంత్రి మే 22న ప్రసంగించే అవకాశం ఉన్నది. గతంలో 17 సార్లు జరిగిన ఈ కాంగ్రెస్ సమావేశాల్లో ఇతర దేశాలకు చెందిన వ్యక్తికి  ప్రారంభోపన్యాసం చేసే అవకాశం మెదటి సారి కెటి రామారావుకి దక్కింది.

Ktr for America

తెలంగాణ ప్రభుత్వం సాగునీటి, తాగునీటి రంగాల్లో సమతుల్యత సాధించే దిశగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. వచ్చే మే నెలలో 18-19 తేదిల్లో జరిగే తమ వార్షిక సదస్సులో ప్రసగించాల్సిందిగా స్టాన్ పొర్డ్ యూనివర్సీటీ ఇప్పటికే అహ్వనం పంపింది. స్టాన్ పొర్డు యూనివర్సీటీ వరుసగా రెండో ఏడాది మంత్రికి ప్రత్యేక అహ్వనం పంపింది. ఈ సమావేశంలో ఉపాది-ఉద్యోగాలు, ఎంటపెన్యూర్ షిప్ అంశాల మీద మంత్రి ప్రసంగించాల్సిందిగా కోరింది. ఐటి రంగంలో గత రెండున్నర సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్యోగాలను, ఎంటర్ ప్రెన్యూర్ షిప్‌ను ప్రొత్సహించేందుకు ఉన్న అవకాశాలపైన మాట్లాడాలని కోరింది.

ఈ సమావేశానికి స్టాన్‌పొర్డ్ విద్యార్దులు, ప్యాకల్టీతోపాటు వివిధ దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు సైతం హజరవుతారని, వీరందరికి తెలంగాణ సాధించిన ప్రగతి ఒక కేస్ స్టడీగా ఉపయోగపడే అవకాశం ఉందని యూనివ్సరీటీ  మంత్రికి పంపిన లేఖలో తెలిపింది.  నూతన భారతదేశానికి ప్రతినిధిగా మంత్రి ఉన్నారంటూ మంత్రికి పంపిన ప్రత్యేక అహ్వనంలో స్టాన్‌పొర్డ్  ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ అంజిని కోచ్చార్ తెలిపారు. రెండు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గోనేందుకు ప్రభుత్వ అనుమతి మేరకు వెళ్తానని మంత్రి కెటి రామారావు తెలిపారు.

- Advertisement -