ఎల్‌ఆర్‌ఎస్‌ని వేగవంతం చేయండి…

237
KTR Focus On Reforms In Municipal Corporation
- Advertisement -

తెలంగాణ ఏర్పడిన తర్వతా ప్రజలు ప్రభుత్వం నుంచి సరికొత్త పాలన అశించారని, ఆ దిశగా అనేక పాలనా సంస్కరణలతో ముందుకు పొతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. ఖైరతాబాద్ లోని ఇన్టిట్యూషన్ అప్ ఇంజనీర్స్ కార్యాయలంలో జరిగిన ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, డిటిసిపి అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు హజరయ్యారు.

సాదారణ పౌరునికి అత్యంత పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు వచ్చేలా డిపియంస్ విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చామని మంత్రి తెలిపారు. ఈ విధానంలో నెల రోజుల గడువును కుదించి 21 రోజుల్లోని అన్ని అనుమతులు వచ్చేలా చేశామన్నారు. అనుమతి చేసుకున్న వారం రోజుల్లో దరఖాస్తులో ఉన్న లోపించిన పత్రాల తాలుకు సమాచారాన్ని దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. అనుమతుల ప్రక్రియలో ఉన్న అనవసర ఆలస్యాన్ని తగ్గించేందుకే ఈ విధానం తీసుకుని వచ్చామని తెలిపారు.

KTR

డిపియంయస్ విధానం పట్ల టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తి అవగాహణ పెంచుకోవాలని, సంపూర్ణ పరిజ్జానంతో పనిచేయాలని మంత్రి అధికారులను కోరారు. ప్రజల్లో అధికార వ్యవస్దకు మరింత పేరు తేచ్చేలా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలన్నారు. ప్రభుత్వం తేచ్చిన అన్ లైన్ విధానం పట్ల మంత్రి అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారిస్తుందన్న మంత్రి, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 21 రోజుల గడువు లోపల అనుమతులు ఇవ్వకుండా ఆలస్యం చేసే అధికారులపైన టియస్ ఐపాస్ లో మాదిరి ఫెనాల్టీలు వేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం అవుతామని మంత్రి తెలిపారు.

నూతనంగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమ కట్టడాలను అరికట్టడం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దీంతోపాటు అన్ని పురపాలికల్లోని లేఅవుట్లలోని ఖాళీ ప్రదేశాలు( ఓపెన్ ప్లాట్లు) ను కాపాడడంలో మున్సిపల్ కమిషనర్లతో కలిసి పనిచేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్ధానికంగా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులతోపాటు రాష్ట్ర స్ధాయిలో తీసుకోవాల్సిన చర్యలపైన వివరాలు అందించాలని సిడియంఏ శ్రీదేవి, డిటిసిపి డైరెక్టర్లను అదేశించారు. ప్రస్తుతం నడుస్తున్న ఏల్ అర్ యస్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను కోరారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తమ విధుల్లో టెక్నాలజీ సహాకారంతో విధులు నిర్వర్తించేందుకు అవసరం అయిన సూచనలివ్వాలనన్నారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ,హెచ్ యండిఏ కమిషనర్లు, సిడియంఏ, డిటిసిపి మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -