అమీర్‌తో ఖచ్చితంగా చేస్తా : చిల్లర్‌

92
I want to work in an Aamir Khan film...

ఇటీవలే మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నమానుషీ చిల్లర్ తన మనసులోని మాటను బయటపెట్టేసింది. మిస్ వరల్డ్ గా నిలిచిన ఈ భారతీయ సుందరి తన తరువాత లక్ష్యం సినిమాలే అని తేల్చి చెప్పింది. బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్‌ నటన అంటే తనకు చాలా ఇష్టమని, అతడితో కలసి న‌టించాల‌ని ఉంద‌ని చెప్పేసింది చిల్లర్‌.

  I want to work in an Aamir Khan film...

అమీర్ సినిమాలు ఎంట‌ర్‌టైనింగ్‌తో పాటు సందేశాత్మ‌కంగా ఉండ‌డంతో అమీర్‌తో క‌లిసి ఓ సినిమా త‌ప్ప‌క చేస్తాన‌టోంది. ఇక మిస్ వరల్డ్ గా నిలిచిన చాలా మంది భారతీయ మహిళలు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ అందుకోవడం మనం చూశాం. ఇప్పుడు అదే జాబితాలో మానుషీ చిల్లర్ కూడా చేరబోతోందో లేదో తెలియాలంటే కాస్త వెయిట్‌ చెయ్యాల్సిందే మరి.

ఇదిలా ఉంటే..ఓ మ్యాగజైన్ క‌వ‌ర్ పేజ్ కోసం ఫోటో షూట్‌లో పాల్గొన్న ఈ సుందరి హాట్ హాట్ స్టిల్స్ తో అదరగొట్టింది. హాట్ గా కన్పిస్తున్న ఈ సుందరి ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

 I want to work in an Aamir Khan film...

….