బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఫిట్‌నెస్ గురించి చేసిన సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గత ఆరు నెలలుగా పొట్ట పెరిగిపోవడంతో దాన్ని దాచుకోవడం కష్టంగా మారిందని, అందుకే మళ్లీ జిమ్ చేయడం ప్రారంభించానని ఆయన హాస్యంగా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పంచుకున్నారు.
“పొట్టను దాచుకోలేక విసిగిపోయాను 😁. ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ జిమ్ ప్రారంభించాను. జూలైలో నాకు 50 ఏళ్లు పూర్తి అవుతాయి. అప్పటికి మంచి ఫిట్‌నెస్‌తో ఉండాలని ప్రయత్నిస్తున్నాను,” అని కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.
కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మీరు చాలా ఫిట్‌గా ఉన్నారని, మీ వయస్సుకంటే 15 ఏళ్లు చిన్నగా కనిపిస్తున్నారని కొందరు కామెంట్ చేశారు. “యుద్ధానికి సిద్ధమవుతున్న రామన్న” అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, “పాదయాత్రకు సిద్ధమవుతున్నారా అన్న?” అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో కేటీఆర్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tired of hiding my paunch 😁
Started training again after a gap of 6 months. Hoping to be in better shape by July when I turn 50#FitnessGoals pic.twitter.com/o99hm3tEj4
— KTR (@KTRBRS) March 11, 2026
Also Read:సత్యవతిగా రీతు!

