పాలమూరు ఎత్తిపోతల పథకంను కేంద్రం అడ్డుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నారాయణపేట ప్రగతి నివేదన సభలో మాట్లాడుతూ…ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పనిమంతులకు పట్టం కట్టండని పిలుపునిచ్చారు. అంతకుముందు నారాయణపేటలోని బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులకు నీళ్లు అందించే బాధ్యత సీఎం కేసీఆర్‌దే అని అన్నారు.
2024లో కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తెచ్చుకుందామన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు దాటి పోయింది. ఎప్పుడైనా అన్నదమ్ముళ్లు వేరుపడితే ఆస్తిపంపకాలు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాయి. రాష్ట్రం వేరు పడక ముందు 811 టీఎంసీల వాటా మనకు ఉందని ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ట్రిబ్యునల్‌కు లేఖ రాసేందుకు కేంద్రానికి, మోదీకి సమయం దొరకడం లేదట. పంచాయితీని సెటిల్ చేసే ఉద్దేశం వారికి లేదు. ఎందుకంటే పాలమూరు ఎండాలి. ఎండితేనే కడుపు మండి ఉన్న ప్రభుత్వం మీద తిరగబడి మాకు అవకాశం ఇస్తారనే దురాలోచనతో ఉన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే.. మహబూబ్‌నగర్ జిల్లా మీద ప్రేమ ఉంటే.. పాలమూరులో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న విధంగానే 500 టీఎంసీల కేటాయించాలని మోదీని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయండి. దమ్ము, తెగువ ఉంటే ఆ తీర్మానం చేసి మీ చిత్తశుద్ది రుజువు చేసుకోండి అని సవాల్ విసిరారు.
ఈ దేశానికి ఇప్పటి వరకు 14 మంది ప్రధానులు పని చేసిన…. వారు చేసిన అప్పు రూ. 56 లక్షల కోట్లు. మోదీ ప్రధాని అయ్యాక చేసిన అప్పు.. రూ. 100 లక్షల కోట్లు అని అన్నారు. దేశంలో పుట్టే ప్రతి బిడ్డ మీద రూ. లక్షా 25 వేల అప్పు మోపుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ మీద అదనంగా సెస్సులు వేసి రూ. 30 లక్షల కోట్లను మోదీ వసూలు చేసిండు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ, దగ్బులాజీ డైలాగులు కొడుతూ విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఇలాంటి వారికి తెలంగాణలో అవకాశం ఇవ్వకూడదన్నారు.
ఇవి కూడా చదవండి….
సొంత గూటికి పొంగులేటి..?
బీజేపీకి షాక్..ఇలా అయితే కష్టమే!
ఫిబ్రవరి 17న సచివాలయ ప్రారంభోత్సవం..