సిరిసిల్ల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. స్ధానిక ఆర్డీవో కార్యాలయంలో స్థానిక సీనియర్ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. అనంతరం మంగళవారం సిరిసిల్లలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగసభ స్థలిని పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మార్పులు చేర్పులపై స్థానిక నేతలకు సూచనలు చేశారు. కేటీఆర్ వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, స్థానిక టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.
కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. మెదక్‌లో మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్‌రెడ్డి ఎన్నికల అధికారికి నామపత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్ వేయడానికి ముందు జగదీష్ రెడ్డి – సునీత కుటుంబ సభ్యులతో కలిసి సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సూర్యాపేట బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర్‌రావు నామినేషన్ వేశారు. ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ కోదాడ నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు పలువురు మంత్రులు,కీలక నేతలు ఇవాళేనామినేషన్ దాఖలు చేయనున్నారు.