రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నితిన్..

88
nithin

యంగ్ హీరో నితిన్ కు స‌రైన హీట్ లేక చాలా కాలం అయింది. ఆయ‌న న‌టించిన చివ‌రి సినిమా ఛ‌ల్ మోహ‌న రంగ సినిమా కూడా అంత పెద్ద‌గా విజ‌యం సాధించ‌చ‌లేదు. దీంతో ఆయ‌న త‌న త‌ర్వాతి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఛ‌లో ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములకు గ్రీన్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈసినిమాను సితార ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్ధ వారు నిర్మిస్తున్నారు. వెంకీ కుడుములతో చేయ‌బోయే సినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు.

nithin venky

త్వ‌ర‌లోనే ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు స‌మాచారం. అందుకు సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. తాజాగా నితిన్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై ద‌ర్శ‌కుడు ప్ర‌తాప్ తో సినిమా చేయ‌నున్నాడు. ఈసినిమా జ‌న‌వ‌రి నుంచి రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మొత్తానికి నితిన్ రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. హిట్ కోసం నితిన్ చేస్తోన్న ప్ర‌య‌త్నం ఈసారైనా ఫలిస్తుందేమో చూడాలి.