చేనేత దుస్తుల్లో విధులకు మంత్రి కేటీఆర్‌

250
KTR encourages handloom textile sector
- Advertisement -

చేనేతలకు చేయూతనిచ్చేందుకు మంత్రి కెటిరామరావు చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. అందరికి చేనేత వస్త్రాలు ధరించాలని చేప్పేముందు స్వయంగా పాటించాలని నిర్ణయించుకున్నమంత్రి ఈ రోజు స్వయంగా చేనేత వస్ర్తాలు ధరించి కార్యాలయానికి వచ్చారు. మంత్రితోపాటు అయన కార్యాలయంలోని అఫీసర్ నుంచి అటెండర్ వరకు అందరు చేనేతలు వస్ర్తాలు ధరించారు. ఇకపైన ప్రతి సోమవారం ఖచ్చితంగా చేనేత వస్ర్తాలను ధరించనున్నట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు.

తనతో పాటు తన ప్రతి శాఖలోని ఉద్యోగులు చేనేత వస్ర్తాలు ధరించనున్నట్లు తెలిపారు. చేనేత వస్ర్తాలను ప్రాముఖ్యతను ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ చేనేత శాఖ (టెస్కో)ద్వారా ఈ మేరకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. సంస్ధ అన్ లైన్ అర్డర్లు స్వీకరించే వెబ్ సైట్ ను అధునికీకరించనున్నట్లు, చేనేత అమ్మకాల కేంద్రాలను మరిన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు చేనేత డైరెక్టర్ శైలజా రామయ్యర్ కు అదేశాలు జారీ చేశారు. మంత్రి సూచనలతో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ శాఖ కమీషనర్లు, ఇతర శాఖల అధికారులు ఈ మండే హ్యాండ్లూమ్ కార్యక్రమాన్ని చేపట్టారు.

KTR encourages handloom textile sector

ఈ మేరకు మంత్రి వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా చేనేత వస్ర్తాలను ధరించిన ఐటి, మున్సిపల్, చేనేత, టెక్స్టైల్, పరిశ్రమల శాఖల విభాగాధిపతుల, ఉద్యోగులు మంత్రిని కలిసారు. తెలంగాణ చేనేత శాఖాధికారులు అందజేసిన చేనేత వస్ర్తాన్ని మంత్రి ఈ రోజు ధరించారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన రాజకీయనేతలు, ఉద్యోగులను చేనేత వస్ర్తాలు ధరించార అని అడుగుతూ, ఇకపైన వారంలో ఒక్కసారైన చేనేతను ధరించాలని కోరారు. చేనేత వస్ర్తాలు ధరించిన పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్, ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మెట్రో వాటర్ వర్క్ యండి దానకిషోర్, హ్యండూలూమ్ డైరెక్టర్ శైలజా రామయ్యార్ తదితరులు తమ ఉద్యోగుల బృందంతో మంత్రిని కలిశారు. ఈరోజు నుంచి ప్రతి సోమవారం చేనేత వస్ర్తాలను ధరించనున్నట్లు తెలిపారు.

KTR encourages handloom textile sector

చేనేత వస్ర్తాలను ధరించాలని మంత్రి ఇప్పటికే ప్రజాప్రతినిధులకు ఒక లేఖ రాశారు. అసెంబ్లీలో చేనేత శాఖ తరపున ఇప్పటికే చేనేత వస్ర్తాలను అందించారు. తన పరిధిలో ఉన్న ప్రతి శాఖ అధికారులతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ అధికారులు గ్రీవెన్స్ డే రోజు చేనేత వస్ర్తాలు ధరించి, ప్రజల్లో చేనేతల పట్ల చైతన్యం కలిగించాలని కోరారు. పలు జిల్లాల కలెక్టర్లు సైతం ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గోన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మంత్రిని కలిసేందుకు వచ్చిన పలువురు చేనేత వస్ర్తాలు ధరించి వచ్చి, మంత్రి పిలుపు మేరకు తాము సైతం హ్యండ్లూమ్ మండే కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.

- Advertisement -