కేటీఆర్.. దాతృత్వంలో దానకర్ణుడే

193
- Advertisement -

నాయకుడంటే తాను నడిచి ఆ దారిలో మిగతా వారిని నడిపించేవాడే..అలాంటి వారు మనకు రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు.. నాయకుడంటే ప్రభుత్వాన్ని దోచేసుకునేవాడు అని సామాన్యుల అభిప్రాయం.. అయితే ఆ అభిప్రాయాల్ని దూరం చేస్తూ మానవత్వానికి, నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నారు మన కేటీఆర్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గురుతర బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న కేటీఆర్ తన దాతృత్వంతో.. మంచి గుణంతో మనసున్న మారాజుగానూ మంచి మార్కులు సంపాదిస్తున్నారు.

KTR

మొన్న ఓ ముసలి తల్లికి ఇల్లు.. నిన్న ఐస్ గోలా అమ్మిన తన చిన్ననాటి తాతకు సాయం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. తాజాగా పుల్వామాలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని కేటీర్ భావించారు.. అనుకున్నదే తడవుగా తన స్నేహితుల నుంచి 25 లక్షలు సేకరించారు.. తన సొంత డబ్బు మరో 25 లక్షలు దానికి జత చేశారు.. ఆ మొత్తం డబ్బు 50 లక్షల రూపాయల్ని హైదరాబాద్ లోని సీఆర్పీఎఫ్ ఐజీపీ రాజుకు అందజేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ఎంతో బావోద్వేగానికి లోనయ్యారు.. సైన్యం, సీఆర్పీఎఫ్.. తదితర భద్రతా బలగాల వల్లే దేశంలోని ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్ర పోగలుగుతున్నారని.. వారికి ఎంత చేసినా తక్కువే అన్నారు.. ఇలా తన విశాల హృదయాన్ని చాటిన కేటీఆర్‌పై సర్వతా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన బాటలో వెంటనే పలువురు ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు సైతం విరాళాలు ప్రకటించారు.. అలా తన నాయకత్వ స్ఫూర్తిని చాటారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్.

- Advertisement -