కేసీఆర్‌పై కోపంతో పేదలకు అన్యాయమా?

8
- Advertisement -

కేసీఆర్‌పై కోపంతో పేదలకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 24న తన పుట్టిన రోజు సందర్భంగా ఐదు వేల మంది తల్లులకు కేసీఆర్ కిట్లను అందించారు కేటీఆర్.

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ కిట్ల పంపిణీ చేశారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదు…కేసీఆర్ కిట్ లతో మాతాశిశు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి అన్నారు. కేసీఆర్ కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదన్నారు కేటీఆర్.

బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాత శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ కిట్లను ఇస్తానని ప్రకటించిన కేటీఆర్, “గిఫ్ట్ ఏ స్మైల్” లో భాగంగా హైదరాబాద్ కు చెందిన తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ కిట్లను అందించారు. గత 20 నెలల నుంచి కేసీఆర్ కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే తన పుట్టిన రోజు సందర్భంగా 5 వేల మంది తల్లులకు సిరిసిల్లలో కేసీఆర్ కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు.

2014 కు ముందు నేను రాను బిడ్డో సర్కారు దవఖానకు అని జనాలు భయపడేవారన్న కేటీఆర్, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న చర్యలతో సర్కార్ దవాఖానాకే పోవాలని జనాలంతా అనుకున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలను మార్చిన కేసీఆర్ కిట్లను గత 20 నెలల నుంచి రేవంత్ సర్కార్ ఇవ్వకపోవడం దుర్మార్గం అన్నారు. కేసీఆర్ మీద ఉన్న అంతులేని ద్వేషం, కోపమే ఇందుకు కారణమని విమర్శించారు.

Also Read:ధన్‌ఖడ్ రాజీనామాకు కారణం ఇదే!

- Advertisement -