కార్యకర్తలను పార్టీ కడుపులో పెట్టి చూసుకుంటుంది

372
KTRTRSCHEQUES
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న 60లక్షల మంది కార్యకర్తలను కడుపులో పెట్టుకుంటి చూసుకుంటామన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మృతి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో బీమా చెక్కులు అందజేశారు. టీఆర్‌ఎస్ పార్టీకి 60లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదన్నారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..’ఈసారి బీమా కింద 1,581 మందికి రూ.31కోట్ల 62 లక్షల చెక్కులు అందించాం. మిమ్ములను కలుసుకోవడం కొంత బాధగా ఉన్నా పార్టీ తరఫున మీకు అండగా ఉంటున్నందుకు సంతోషంగా ఉంది.దేశంలో ఒకటి రెండు పార్టీలు మాత్రమే బీమా సౌకర్యం కల్పిస్తున్నాయి. 60లక్షల మంది కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.11.50కోట్లు చెల్లించామని చెప్పారు.

- Advertisement -