బిగ్‌బాస్ విన్నర్‌ కంటే రన్నరప్‌కే ఎక్కువట..!

84
bigg boss

తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 3లో విన్నర్‌గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం యూత్ మొత్తానికి ఐకాన్ గా నిలిచాడనే చెప్పవచ్చు.. ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్ రూ.50 లక్షల భారీ నగదు అందుకున్నాడు. ఈ భారీ మొత్తంతో పాటు ఒక ట్రోఫీని కూడా రాహుల్ అందుకున్నాడు.

కాగా రాహుల్ సిప్లిగంజ్‌కి వచ్చింది రూ. 50 లక్షలు అయితే.. వాటిలో టాక్స్‌‌లు మినహాయించి చేతికి వచ్చేది కేవలం రూ. 36-37 లక్షలు మాత్రమేట. రాహుల్ రెమ్యూనరేషన్ అన్నీ కలుపుకుని సుమారుగా అతని చేతికి అందేది రూ. 50 లక్షలు. అయితే రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్న శ్రీముఖి.. రెమ్యూనరేషన్ విషయంలో రాహుల్‌ కంటే భారీ మొత్తం అందుకుందని సమాచారం.

sreemukhi

బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా సత్తా చాటిన శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు రోజుకు రూ లక్ష డిమాండ్‌ చేసినట్టు చెబుతున్నారు. ఆమె పాపులారిటీకి ఫిదా అయిన బిగ్‌ బాస్ నిర్వాహకులు షోకు సైన్‌ చేసేముందు పునరాలోచన లేకుండా ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది.

105 రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి కొనసాగడంతో కాంట్రాక్టు ప్రకారం రూ 1.05 కోట్ల చెక్‌ ఆమెకు దక్కింది. టైటిల్‌ విజేత రాహుల్‌ సహా ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే ఆమె రెమ్యూనరేషన్‌ చాలా అధికం కావడం హాట్ టాపిక్ గా మారింది.