మోడీ చిత్తశుద్దిని నిరూపించుకోండి: కేటీఆర్

13
- Advertisement -

కంచ గచ్చిబౌలి భూముల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరపాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ వ్యవహారంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నారు.

హెచ్‌సీయూలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధాని మోదీ మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలి అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలి అంశం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం. కాంగ్రెస్‌ చేసిన ఆర్థిక మోసంపై ఇప్పటికే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, సీబీఐ, ఆబీఐ, సెబీ, ఎస్‌ఎఫ్‌ఐఓలకు ఆధారాలతో సహా తెలియజేశాం అన్నారు.

నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. నిస్సిగ్గుగా, అక్రమంగా పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్‌ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కంచ గచ్చిబౌలిలో రూ.10 వేల కోట్ల ఆర్థిక అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. ప్రధానిగా పర్యావరణ పరిరక్షణ, నిర్వహణపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటి కాదని, కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదని నిరూపించుకోవాలి అని డిమాండ్ చేశారు.

Also Read:Tirumala:టీటీడీ ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

- Advertisement -