HCU కుంభకోణం..మోడీ మాటల వరకేనా?: కేటీఆర్

13
- Advertisement -

HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెరువును కూడా రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టాడు అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప చెరువును ఎవడు తాకట్టు పెట్టడు అన్నారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్… రేవంత్ రెడ్డి HCU భూములపై చేసిన కుంభకోణంపై మోడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు చెప్పాలన్నారు.

HCU భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నాడని మోడీ హర్యానాలో మాట్లాడాడు… మోడీ మాటల వరకేనా? HCU భూముల కుంభకోణంపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు నియమించిన సీఈసీ HCU భూములపై కుంభకోణం జరిగిందని, ఇన్విస్టిగేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని నిన్న నివేదిక ఇచ్చింది… ఈ కుంభకోణంపై మా పార్టీ తరపున అన్ని ఆధారాలతో సహా లేఖ రాశాం అన్నారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలి… లేదంటే మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని మేమే కాదు తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటారు అన్నారు.

Also Read:మెదక్‌.. చిక్కిన చిరుత

- Advertisement -