- Advertisement -
స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కుమార్‌తో సమావేశమయ్యారు మంత్రి కేటీఆర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొనేందుకు దావోస్‌కు చేరుకున్న కేటీఆర్….నీరజ్ కుమార్‌తో సమావేశం సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. హెచ్‌పీఈ సీవోవో విశాల్ లాల్‌తో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై మంత్రి కేటీఆర్ వారికి వివరించారు.
వరల్డ్ ఎకనామిక్ సదస్సులో భాగంగా టెక్నాలజీ ప్రయోజనాలు- ఎదురయ్యే సవాళ్లపై చర్చ జరుగనున్నది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో సాంకేతిక ప్రయోజనాలు- సవాళ్లను నివారించడం అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. సాంకేతికత వినియోగంలో తెలంగాణ ప్రభుత్వ ప్రగతిని వివరిస్తారు.
- Advertisement -