మెగా హిరో కొత్త సినిమా అప్ డేట్స్

365
varuntej
- Advertisement -

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటివలే గద్దలకొండ గణేశ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తర్వాతి మూవీ కోసం బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

వరుణ్ తేజ్ తన తర్వాతి మూవీ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. అల్లు అరవింద్ పెద్దకుమారుడు అల్లు బాబీ – సిద్ధూ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చేనెల 17వ తేదీ నుంచి వైజాగ్ లో రెగ్యులర్ షూటింగును జరుపుకోనుంది. ఇక ఈమూవీలో వరుణ్ తేజ్ కు విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కనిపించనున్నాడు. ఈమూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

- Advertisement -