సభలో కేటీఆర్‌ స్టెప్పులు…అదుర్స్..

222
- Advertisement -

ప్రగతినివేదన సభలో మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభలో హుషారుగా కనిపిస్తూ..తోటివారిలో ఉత్సాహాన్ని నింపారు. అంతేనా..ఇవాళ ఉదయం కళాకారులతో కలిసి డోలు వాయించారు కేటీఆర్‌.

ktr dance in pragathi nivedana sabha

డోలును ఎలా వాయించాలో రసమయి బాలకిషన్‌ చెప్పడంతో..అందుకు తగ్గట్టుగానే డోలు కొడుతూ..ఉత్సాహంతో స్టెప్పులేశారు కేటీఆర్. దాంతో మిగతా కార్యకర్తలు కూడా కాళ్ళుకదుపుతూ..ఆపై కేటీఆర్‌ ను తమ భుజాలపై ఎత్తుకొని అభినంధించారు.

ఇక సభా ప్రాంగణంలో తిరిగిన కేటీఆర్.. మహిళా కార్యకర్తలను పలుకరించారు. గత ఐదారు రోజుల నుంచి ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను కేటీఆర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కార్యకర్తలను కేటీఆర్ సమన్వయ పరుస్తూ.. సభకు ఎలాంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కేటీఆర్.

 ktr dance in pragathi nivedana sabha

..

- Advertisement -