జిఆర్‌ఎంబీ (GRMB) సమావేశం ఎజెండాను ఒప్పుకున్నారా? ఈ సమావేశానికి హాజరవుతారా? హాజరైతే తెలంగాణ ప్రజల తరఫున ఏం చెప్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్.. ఈ విషయంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. ..తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఈ జల ఉద్యమం వస్తది అన్నారు.
తెలంగాణ నీటి హక్కులకు మించిన మరో ప్రాధాన్యత మా పార్టీకి లేదు. నదీ జలాల్లో కేంద్రమైనా, రాష్ట్రమైనా నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదు.కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణకు నీటి వాటాల్లో అన్యాయం చేస్తే, తెలంగాణ ఉద్యమానికి మించి మరొక ఆందోళన తెలంగాణలో వస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే ఎజెండాను ఒప్పుకొని ఎలా మీటింగ్‌కి హాజరవుతుంది? ,ప్రభుత్వానికి సిగ్గు ఉంటే… ఈ ప్రభుత్వానికి సమావేశానికి ఎలా హాజరవుతారో ప్రభుత్వం చెప్పాలి అన్నారు.
తెలంగాణ వ్యతిరేకి ఆదిత్యనాథ్ దాస్ ని సలహాదారుగా పెట్టుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సిగ్గుమాలిన చర్య. తెలంగాణలో ఒక్క ఇంజనీర్ కూడా లేరా?..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చెప్పుచేతల్లోకి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు చెప్పుచేతల్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. రెవంత్ రెడ్డికి సిగ్గుంటే ఆదిత్యనాథ్ దాస్ ని తొలగించాలి.నీళ్లు, నిధులు, నియామకాలతో కొట్లాడిన తెలంగాణలో మరోసారి నీళ్ల దోపిడీకి తెలంగాణ గురవుతున్నది. ఇదే జరిగితే కచ్చితంగా బిఆర్ఎస్ మరోసారి నీళ్ల కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది. నదుల నుంచి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తిపోసుకుంటే… ముఖ్యమంత్రికి కనీసం సోయి లేదు. మేము లక్షల మంది రైతులతో వెళ్లి పంపులు ఆన్ చేస్తామంటేని ఈరోజు పంపులని మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం..మహహబూబ్ నగర్ జిల్లా అని, మా పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి పాలమూరు నీళ్లు ఇచ్చే సోయి లేదు అన్నారు.
మహబూబ్ నగర్ బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నీళ్లు ఇచ్చే సోయి లేదు. వర్షాలు పడి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తి పోసుకుంటే ముఖ్యమంత్రికి కనీసం సోయి లేదు.ప్రధాన ప్రతిపక్షం ముళ్ళు కట్టెతో పొడిస్తేనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది లేదంటే నిద్రపోతున్నది.యాగాలు చేస్తే తప్పు లేదు కానీ… యాగాలతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి తన బాధ్యతలు నిర్వహించాలి. కానీ, ప్రజలకు సంబంధించి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన కష్టాలను పట్టించుకోవాలి. రేవంత్ రెడ్డికి పంపులు ఎప్పుడు ఆన్ చేయాలి, నీళ్లు ఎప్పుడు ఎత్తిపోయాలో కనీస అవగాహన లేదు.పాలమూరు జిల్లా బిడ్డ అని చెప్పుకునే రేవంత్ కనీసం అక్కడికి చెరువులలో నీళ్లు నింపడానికి కూడా సోయి లేదు. సాగునీటి ప్రాజెక్టుల పైన తెలంగాణకు నష్టం జరిగేలా ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలను అంగీకరిస్తున్నారా లేదా అన్నది కాంగ్రెస్ ఇప్పటిదాకా స్పష్టం చేయలేదు.క్షుద్రపూజలు అని చెప్పి క్షుద్ర రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సిగ్గుపడాలి.తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ కోసం త్యాగాలు చేసినవాళ్ళం. క్షుద్ర రాజకీయాలు చేయవలసిన అవసరం మాకు లేదు…అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం.కాంగ్రెస్ లాగ పార్టీ క్షుద్ర రాజకీయాలు మాకు తెలియదు. హరీష్ రావు గుడికి పోతే తప్పా? ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవచ్చా? ..కాంగ్రెస్ పార్టీలాగా మేడిగడ్డకు, చెక్ డ్యామ్ లోనూ ధ్వంసం చేసి ఓట్లు దండుకోవాలని చూడలేదు అన్నారు.
నీళ్లు ఉన్నా కూడా రైతులను ఎండబెట్టే కాంగ్రెస్ సంస్కృతి మాది కాదు. కరెంటు ఉండి కూడా వ్యవసాయదారుడికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. ఏ సబ్ స్టేషన్ కైనా రావడానికి మేము సిద్ధం. 24 గంటల కరెంట్ వస్తే ఇంకా ఎక్కడ ఉందో చెప్పాలి. కనీసం ఐదు, ఆరు సార్లు ప్రతిరోజూ కరెంట్ కోతలు అవుతున్నాయి.అధికంగా బోనస్, పెన్షన్లు… అధిక బోనస్ చెల్లిస్తాము అని, అనేక ఇతర హామీలు చేస్తాము, అమలు చేస్తామంటే అధికారం ఇచ్చారు ప్రజలు. కానీ, అవన్నీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు.పక్క రాష్ట్రం నదుల నుంచి నీళ్లు ఎత్తుతుంటే రేవంత్ రెడ్డికి ఇంకా సోయి లేదు. చేయాల్సిన పనులు చేయకుండా కేవలం దేవుడి పైన భారం వేస్తా అంటే ఆయన కూడా హర్షించడు.ఇక్కడ ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక హైకోర్టు ప్రభుత్వాన్ని హైడ్రా విషయంలో అభిశంసన ఇచ్చిన తీరుగా ఎప్పుడూ చేయలేదు.ప్రభుత్వ అధికారులపైన నమ్మకం లేదు, ఆర్మీని ఈ రంగంలోకి దించుతామని అంత ఘాటుగా ఎప్పుడూ చెప్పలేదు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి అసమర్థతకు, వైఫల్యానికి నిదర్శనం. హైకోర్టు చెప్పినా సుప్రీంకోర్టు చెప్పినా పట్టించుకోను అంటే ముఖ్యమంత్రికి న్యాయస్థానాల పైన ఉన్న గౌరవం ఏంటో తెలిసిపోయింది. కోర్టులు చెప్పినా హైడ్రా విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజాస్వామికవాదులు గుర్తించాలి. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానాన్ని గుర్తించాలి. రేవంత్ రెడ్డి హిట్లర్ అని చెప్పుకున్నట్లే రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవడం లేదు. ప్రజలను విపత్తుల నుంచి రక్షించడానికి ఈవీడియం అనే సంస్థను పెట్టాం. దాని పేరు మార్చి ప్రజల్ని విపత్తుల్లోకి, విధ్వంసంలోకి నెట్టేలా హైడ్రాని తయారు చేశారు. పేదలను కొట్టి పొందిన 2500 ఎకరాల భూమిని సేకరించి వాటిని పెద్దలకు అమ్ముతామని ప్రభుత్వం చెబుతుంది. పేదలను కొట్టి పెద్దవాళ్లకు దోచిపెట్టడమే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి చేస్తున్న పని. గతంలో మా ప్రభుత్వ హయాంలో రెండున్నర లక్షల మందికి 58 జీవో ద్వారా పట్టాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క పట్టా అయినా ఇచ్చిందా? పైగా వేలాది మంది ఇళ్లను కూలగొట్టారు అని మండిపడ్డారు.
Also Read:25 రన్స్‌కే 8 వికెట్లు..పేసర్ విద్వంసం!

