షీ టీమ్స్‌కు ఐదేళ్లు..కేటీఆర్ విషెస్

736
ktr
- Advertisement -

షీ టీమ్స్‌ ప్రారంభించి 5 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్.. మహిళల భద్రత కోసం 2014,అక్టోబర్ 24న సీఎం కేసీఆర్‌…షీ టీమ్స్‌కి శ్రీకారం చుట్టారని తెలిపారు.

త్వరలో రాష్ట్రమంతటా షీ టీమ్స్‌ సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఈ ఐదు సంవత్సరాల ప్రయాణంలో 33,700 కేసులు నమోదయ్యాయయని చెప్పారు. మహిళ భద్రత,వారికి రక్షణ కల్పించడంలో అధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో షీ టీమ్స్‌ కీ రోల్ పోషించాయని చెప్పారు. మహిళలను వేధిస్తున్న మైనర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం… వేధింపులకు గురయ్యే మహిళలు తమకు షీ టీమ్స్ అండగా ఉన్నాయనే ధీమాను వారిలో కల్గించగల్గుతున్నాయని చెప్పారు కేటీఆర్.

- Advertisement -