KTR:విద్యార్థుల అరెస్ట్ అప్రజాస్వామికం

26
- Advertisement -

నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్ అక్రమమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్ నోటిఫికేషన్లలోని సమస్యలు, జాబ్ క్యాలెండర్ వంటి అంశాల పైన టీజీపీఎస్సీ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపి, ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేయాలనుకున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.

విద్యార్థులపై పోలీసుల ద్వారా అణిచివేత చేపట్టడం సరికాదని… శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నం చేసిన యువకులు నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని తప్పుపట్టారు. కేవలం ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు నిరుద్యోగులను వాడుకొని ఈరోజు వారు డిమాండ్ చేస్తున్న న్యాయమైన అంశాలపైన కూడా నోరు మెదపడం లేదన్నారు.

ప్రజా పాలన పేరును పదేపదే వల్లే వేసే కాంగ్రెస్ సర్కార్ జమానాలో యువకులకు, విద్యార్థులకు నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందన్నారు. నిరుద్యోగులు చేస్తున్న అన్ని నిరసన కార్యక్రమాలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Also Read:ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా!

- Advertisement -