ఎంజీఎం ఆసుపత్రి వద్ద మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి దారుణం అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించిన కేటీఆర్..వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయపడిన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
రోగుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన ప్రజాప్రతినిధిపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం ఏమిటి? …ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన నాయకుడిని అడ్డుకోవడమే కాకుండా కడుపులో తన్నడం, చేయి విరిగేలా దాడి చేయడం అత్యంత గర్హనీయం.వినయ్ భాస్కర్‌పై జరిగిన దాడికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ఈ ఘటనపై సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి, హోంమంత్రి అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా లోపాలపై ప్రశ్నలు వస్తున్న సమయంలో, గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం మరింత ఆందోళన కలిగించే విషయం.వినయ్ భాస్కర్‌పై జరిగిన ఘటనపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపించాలి. బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధుల హక్కులను, ప్రజలను పరామర్శించే హక్కును ప్రభుత్వం గౌరవించాలి అన్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నించే గొంతులను పోలీసు బలంతో అణచివేయాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ఎన్నటికీ ఆమోదయోగ్యం కాదు…ఎంజీఎం ఆసుపత్రిలో గాయపడిన రోగులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఆసుపత్రి భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి అన్నారు.
Also Read:అనుమాన పక్షి..కామెడీ,మిస్టరీ!

