ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ రంగానికి చెందిన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని మళ్లీ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. అమరావతి వేదికగా సమాచార పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డులపై కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ఈ అవార్డుల వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో నిలిచిపోయిన అవార్డులతో పాటు కొత్తగా ఇవ్వాల్సిన అవార్డులన్నింటినీ ఒకే ప్రణాళికతో డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సెప్టెంబర్ 2026 | నంది అవార్డుల కమిటీ అధికారిక ఏర్పాటు.
అక్టోబర్ 2026 | విజేతల అధికారిక ప్రకటన.
డిసెంబర్ 2026 లోగా| అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం పూర్తి.
గతంలోనే ఎంపిక చేసి, వివిధ కారణాల వల్ల ప్రధానం చేయకుండా నిలిచిపోయిన 2012 నుండి 2016 వరకు ప్రకటించిన నంది అవార్డులను ప్రభుత్వం అందిస్తుంది.
2017 నుండి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డులను కవర్ చేయడానికి ప్రతీ ఏడాది 4 సంవత్సరాల అవార్డుల చొప్పున బహుకరించాలని నిర్ణయించారు.2025 సంవత్సరానికి సంబంధించిన నంది ఫిల్మ్ మరియు టీవీ అవార్డులను కూడా ఈ వేడుకలోనే అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
Also Read:అనుమాన పక్షి..కామెడీ,మిస్టరీ!
సినీ మరియు బుల్లితెర అవార్డుల ప్రదానోత్సవాలను వేర్వేరు నగరాల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.నంది ఫిల్మ్ & నేషనల్ ఫిల్మ్ అవార్డులు: అమరావతి లేదా విజయవాడ వేదికగా నిర్వహించనున్నారు.నంది టీవీ అవార్డులు: ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు.తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు బుల్లితెర రంగానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు, కళాకారులను గౌరవించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.


