మనీష్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికం..

54
- Advertisement -

ఆప్ నేత, ఎమ్మెల్యే మనీష్ సిసోడియా అరెస్టును ఖండించారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మనీష్ సిసోడియా అరెస్టు ఆప్రజాస్వామికం… బీజేపీ పార్టీ ప్రతిపక్షాల పైన వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గపూరితం అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను బీజేపీ చేస్తుందని మండిపడ్డారు.

ప్రజాబలం లేక అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో రాష్ట్రాల్లో అక్కడి పార్టీలను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకొని బలహీనపరిచే కుట్రలో భాగమే సిసోడియా అరెస్ట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ ప్రతిపక్షాలపై చేస్తున్న రాజకీయ కుట్రలు దేశంలో ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారాయని..బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు మనీష్ సిసోడియా అరెస్ట్ పరాకాష్ట అన్నారు.

ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేక సిసోడియాను ఇప్పుడు అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ అసమర్థ విధానాలను అవినీతిని ప్రశ్నిస్తున్న బలమైన పార్టీలను నాయకులను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తుందన్నారు కేటీఆర్.బీజేపీ తన పార్టీలోని అవినీతి నాయకులను సత్యహరిశ్చంద్రుని సహోదరులుగా చూపించి, ప్రతిపక్షాల నాయకులను అవినీతిపరులుగా చిత్రీకరించి కుటిల ప్రయత్నాలను చేస్తుందన్నారు.బీజేపీ నీతిలేని దుర్మార్గపు రాజకీయాలను దేశం గమనిస్తుందని..బీజేపీ కుట్రపూరిత రాజకీయాలను ప్రజలు కచ్చితంగా తిప్పి కొడతారన్నారు. భవిష్యత్తులో బీజేపీ నాయకులకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.

ప్రజాబలం లేక దొడ్డిదారిన రాజకీయాలు చేయడం, అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటుగా మారిందని…ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీ అన్నారు. తన ప్రలోభాలకు లొంగకుండా నిలబడిన పార్టీలను దెబ్బతీసే కుట్రలను బీజేపీ చేస్తుందని..తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసి బిజెపి భంగపడిందన్నారు. బీజేపీ కుటిల ప్రయత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనించారని…బీజేపీ అప్రజాస్వామిక దుర్మార్గపూరిత కుట్రలకి కాలం దగ్గర పడిందన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -