మాజీ మంత్రి, ఎమ్యెల్యే హరీష్‌రావు సిద్ధిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ యార్డును ప్రారంభించారు. ఆ మార్కెట్‌కు సంబంధించిన ఫోటోలను హరీష్‌రావు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోలను చూసిన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. “చాలా అద్భుతంగా ఉంది. నా అభినందనలు బావా” అని కామెంట్ చేశారు. ఇక కేటీఆర్ అభినందనల ట్వీట్‌ను చూసిన హరీష్‌రావు దానికి రీట్వీట్ చేస్తూ “మెనీ థ్యాంక్స్” అని బదులు ఇచ్చారు.
ఇక నూతనంగా ప్రారంభమైన ఈ మార్కెట్లో అత్యాధునిక సౌకర్యాలు, కూరగాయలు, మాంసం ఉత్పత్తుల విక్రయించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇది సీఎం కేసీఆర్ ఆలోచనలకు తగినట్టుగా నిర్మించారు. ఈ మార్కెట్‌లో ఒకే చోట కూరగాయలు, మాంసాన్ని విక్రయించేందుకు భారీ వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించారు.
ప్రపంచస్థాయి వసతులతో మార్కెట్‌ను తీర్చిదిద్దారు. త్వరలోనే సిద్ధిపేట స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అయితే బుధవారం మాజీ మంత్రి హరీశ్‌తో పాటు స్థానిక కలెక్టర్ కృష్ణభాస్కర్ ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. సుమారు 20 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ బిల్డింగ్‌ను నిర్మించారు.
Looks fabulous. My compliments Bava 👍 https://t.co/mMjcMmQwns
— KTR (@KTRTRS) February 7, 2019
Many thanks 😊
— Harish Rao Thanneeru (@trsharish) February 7, 2019