ప్రియా వారియర్ లిప్‌లాక్‌.. వీడియో వైరల్‌

246
Priya Prakash Varrier
- Advertisement -

ప్రియాప్రకాశ్ వారియర్ ఈ వింకీ పిల్ల గురించి తెలియని వారు ఉండరు. ఒక్క కనుగీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ మళయాలి బ్యూటీ.. ప్రియా వారియర్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ఒరు అదార్ లవ్. రోషన్ అబ్దుల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ తెలుగులో ‘లవర్స్ డే’గా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొద్దిసేపటికే నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. ముఖ్యంగా టీజర్‌లోని లిప్‌లాక్‌ సీన్‌ కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ ముద్దు సన్నివేశం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Priya Prakash Varrier

ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 14వ తేదీన థియేటర్లకు రానుంది అయితే చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. 56 సెకన్ల నిడివిగల ఈ వీడియో యూత్‌కు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ మధ్య ఈ సినిమాలోని ‘ఫ్రీక్ పిల్లా’ సాంగ్ విడుదల కాగా, లక్షల లైక్స్ తెచ్చుకున్న యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఒమర్ లులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

https://youtu.be/ldK_hZq7VWU

- Advertisement -