మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మరోసారి మంచి మనస్సు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించడంలో ముందుండే హిమాన్షు తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నారు.
కార్పొరేట్‌కు ధీటుగా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాడు. హిమాన్షు సీఏఎస్ అధ్యక్షుడిగా తన పాఠశాలలో సేకరించిన నిధులతో ఈ పాఠశాలలో మౌలిక సదుపాయలు కల్పించారు.దాదాపు రూ.కోటి రూపాయలతో పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తీర్చిదిద్దారు. జులై 12న తన పుట్టిన రోజు సందర్భంగా పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
దాదాపు రూ.కోటి రూపాయలతో పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తీర్చిదిద్దారు. సమాజ సేవలో భాగంగా ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు కేశవనగర్‌లోని మండల పరిషత్ పాఠశాలలో బోధించేవారు. అక్కడి పరిస్థితులు చూసి.. దాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. మన ఊరు-మన బడి తో పాటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను సబితా ఇంద్రారెడ్డి అభినందించారు.
Also Read:‘నాయకుడు’ కోసం జానపద గీతం చేశా:రెహమాన్
ఈ సందర్భంగా మాట్లాడిన హిమాన్షు..పాఠశాలను అభివృద్ధి చేసేందుకు సీఏఎస్, సీఎస్ఆర్ కింద నిధులు సేకరించామన్నారు. తోటి విద్యార్థులకు సహాయం చేయడం ఎనలేని ఆనందాన్ని ఇస్తుందన్నారు.