KTR:పైసా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి?

21
- Advertisement -

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మా కోసం ఉన్న మీ అందరికి ధన్యవాదాలు అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంబర్ పేట ప్రజలు ఎంతో విజ్ఞులు కాలేరు వెంకటేష్ కి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు..కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అనుకున్నవాళ్ళు కారు గుర్తుకు ఓటు వేయండి…కాంగ్రెస్ రాగానే కరెంట్ వాటర్ కష్టాలు ప్రారంభం అయ్యాయన్నారు.

మాకు 10 నుండి 12 ఎంపీ సీట్లు ఇవ్వండి ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది..కాంగ్రెస్ తెచ్చిన కష్టాలు తీరాలంటే కారు గుర్తుకు ఓటు వేయండన్నారు.మోడీ ,రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు ఒక్క ఓటుతో దెబ్బకొట్టండి…5 పార్లమెంట్ సీట్లు ఇస్తే ఆనాడు తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అన్నారు.
తెలంగాణ కు గులాబీ జెండానే శ్రీరామ రక్ష..హైదరాబాద్ కు వరదలు వస్తే కిషన్ రెడ్డి రూపాయి సాయం చేయలేదు అన్నారు.ఐదేళ్లలో కిషన్ రెడ్డి అమ్బర్పెట్ కు ఐదు పైసల పనిచేయలేదు..పొరబాటున బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్, పెట్రోల్ ధరలు పెరుగుతాయన్నారు.

ఒక్క పైసా ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి…కేసీఆర్ యాదగిరిగుట్ట కట్టిండు కానీ గుడి పేరు మీద రాజకీయం చేయలేదు అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులోని రిజర్వాయర్లకు దేవుళ్ళ పేరు పెట్టారు కేసీఆర్…జూన్ రెండు నాటికి హైదరాబాద్ కి పదేళ్లు నిండుతాయన్నారు.బిజెపి వాళ్ళకు హైదరాబాద్ మీద పట్టు కోసం హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కుట్ర చేస్తున్నారు…అది అడ్డుకోవాలంటే మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తోనే సాధ్యం…ఆరు గ్యారెంటీలు అమలు కాకపోయినా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారు…కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బిజెపికి లాభం జరుగుద్ది అన్నారు.

Also Read:ఇవి పాటిస్తే మీ ఆరోగ్యం ప‌దిలం..

- Advertisement -