నా బొచ్చు ఇస్తా.. ఏం జేస్తావో చెయ్!

303
- Advertisement -

తెలంగాణలో ఈ మద్య బీజేపీ చేస్తోన్న అక్రమ ఆరోపణలు హాట్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న కాషాయ పార్టీ.. గెలిచే అవకాశం లేదని తెలిసి బి‌ఆర్‌ఎస్ నేతలపై అక్రమ ఆరోపణలకు పాల్పడుతోంది. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఇరికించేందుకు ప్రయత్నించిన కాషాయ పార్టీ.. ప్రస్తుతం బెంగళూరు డ్రగ్స్ కేసు అంటూ మళ్ళీ కొత్త పదం అందుకుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కాగా ఇలా అక్రమ ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కే‌టి‌ఆర్..

” డ్రగ్స్ టెస్ట్ కు నా చర్మం, రక్తం ఇస్తా.. కావాలంటే బొచ్చు కూడా ఇస్తా.. ఏం టెస్ట్ చేస్తారో చేయండి. చిత్త శుద్దితో బయటకు వస్తే చెప్పుదెబ్బలు తినడానికి సిద్దామా ” అంటూ బండి సంజయ్ కి సవాల్ విసిరారు కే‌టి‌ఆర్. ఇవన్నీ ఫాళ్తూ మాటలు, ఫాళ్తూ రాజకీయాలు పనికి మాలిన వాళ్ళు చేస్తారంటూ ” మండిపడ్డారు. నిన్ను గెలిపించిన కరీంనగర్ కు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చావని బండి సంజయ్ ని ప్రశ్నించారు. భాన్ సాలా ను దత్తత తీసుకోవడం తరువాత మూడు నిన్ను గెలిపోయించిన కరీంనగర్ లో నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు అంటూ నిలదీశారు. ఎనిమిదేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్న మెగా పవర్ రూం క్లస్టర్ ను తీసుకొచ్చే దమ్ము ఉందా అంటూ నిలదీశారు. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని కే‌సి‌ఆర్ ను తిట్టడం మాని ప్రజలకు పనికొచ్చే మంచి పనులు చేయని అంటూ హితవు పలికారు కే‌టి‌ఆర్. బీజేపీ నాయకులకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సూచించారు. రాజకీయ లబ్ది కోసం బేకరు మాటలు మనుకోవాలని సూచించారు బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్.

ఇవి కూడా చదవండి…

డ్రగ్స్ టెస్టుకు నేనే ఓకే.. బండి దమ్ముంటే చర్చకు రా..

పవన్ తో ముప్పు.. ఎవరికి ?

క్రిస్మస్ విందుకు హాజరుకానున్న సీఎం…

- Advertisement -