తెలంగాణకు మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. గుంటూరు జిల్లా మంగళగిరి రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ ఏపీ ప్రధాన కార్యలయాన్ని ప్రారంభించారు తోట. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీలో సాగు, తాగునీరు లేదని అన్నారు.
ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు అధికారం చేపట్టాయి… అయినా, ఏపీ రాజధాని నిర్మించుకోలేక పోయాం అని విమర్శించారు. ఏపీ రాజధాని ఏదంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి లేక ఏపీ కునారిల్లి పోతుందని విమర్శించారు.
Also Read:ఏపీ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభం..
ఏపీలో కొత్త పరిశ్రమలు రాలేదు. పెట్టుబడులు లేవు. 13లక్షల కోట్లు దేశంలోకి పెట్టుబడులు వస్తే ఏపీకి వచ్చినవి కేవలం 5700 కోట్లు మాత్రమే అన్నారు. తెలంగాణలో కంపెనీలు క్యూ కడుతున్నాయి. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా కేటీఆర్ పని చేస్తున్నారన్నారు. ప్రతిరోజు ఒక కంపెనీ వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇక్కడ పనిచేసేది తక్కువ.. ఆర్భాటం ఎక్కువ అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొడుతుంది ఒక్క కేసీఆర్ మాత్రమేనని, కేంద్రాన్ని ప్రశ్నించే వ్యక్తి కేసీఆర్ అని చంద్రశేఖర్ అన్నారు.
Also Read:హ్యాపీ బర్త్ డే… మోహన్ లాల్