రాహుల్‌ గాంధీలా పప్పును కాదు:కేటీఆర్

207
KTR
- Advertisement -

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి,టీ కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియాపై మండిపడ్డారు కేటీఆర్. వాస్తవాలను మరచి స్కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాలకు తాను పనికిరాడని ఉత్తమ్ మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. అమెరికాలో ఉండే ప్రతి భారతీయుడు వారి పనులు వారే చేసుకుంటారన్నారు. మీ పప్పులా కాకుండా తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపానని కేటీఆర్ ట్వీట్ చేశారు.

మీలాగా ప్రజల సొమ్మును దోచుకోలేదని…నీ కారులో డబ్బులు తగలబడిన విషయం అందరికి గుర్తుందన్నారు. వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని కుంతియాకు సూచించారు కేటీఆర్. హైదరాబాద్‌లో 2016లో అపిల్ ప్రారంభమైందని ఇప్పటివరకు 3500 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే యాపిల్ సంస్థ దృష్టి కేంద్రీకరించిందన్నారు.

కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు యూఎస్‌లో గిన్నెలు కడిగేవాడని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. వాళ్ల నాన్న చొరవ వల్లే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కేటీఆర్.

- Advertisement -