టీఆర్ఎస్‌లో చేరిన బుల్లితెర నటుడు…

269
Actor JL Srinivas Joins TRS
- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీఆర్ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల నుంచి గులాబీ గూటికి క్యూ కడుతుండగా తాజాగా బుల్లితెర నటుడు,యాంకర్ జేఎల్ శ్రీనివాస్ కారెక్కారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాస్ 30 ఏళ్లుగా ఎన్నో సినిమాలు,సీరియల్స్‌లో నటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస్ తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారని చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేసేందుకు తాను టీఆర్ఎస్‌లో చేరుతున్నానని తెలిపారు.

JL Srinivas Joins TRS - Sakshi

వచ్చేఎన్నికల్లో టీఆర్ఎస్‌ తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. పార్టీ పటిష్టానికి తనవంతు కృషి చేస్తానని తెలిపిన శ్రీనివాస్ సినీ పరిశ్రమ కోసం ఫిలింనగర్ ఎలా ఉందో… బుల్లి తెర కోసం టీవీనగర్ స్థాపన జరగాలని కోరారు.

- Advertisement -