స్పీకర్‌కు బర్త్‌ డే విషెస్‌ తెలిపిన మంత్రి కేటీఆర్‌..

581
ktr
- Advertisement -

నేడు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు. ఆయన 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా స్పీకర్‌కు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, మంత్రి కేటీఆర్‌, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వీరితో పాటు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ,వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహ చార్యులు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని,ప్రజలకు మరింత కాలం సేవ చేయాలని కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

- Advertisement -