తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మెగారక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్,పీయూసీ చైర్మన్ ఏ .జీవన్ రెడ్డి,టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని ….సీం కేసీఆర్ ఒక వరం ఇచ్చారు.అతనే కేటీఆర్.తన ట్యాలెంట్ ద్వారా కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ అని నిరూపించుకున్నారని చెప్పారు.కరోనా ఉన్న కూడా హైదరాబాద్ లో రోడ్స్ వేయడం …ఐటీ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు.పార్టీ కార్యకర్తలను ప్రోత్సాహిస్తూ ముందుకు వెళ్తారని చెప్పారు.
భారత దేశం లో ఐటీ లో ముందుంది హైదరాబాద్…కేటీఆర్ కృషి వల్లే జరిగిందన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్.పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు మిషన్ భగీరథ నీళ్లు ఇంటి ఇంటికి వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకుపోతుందన్నారు.ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ అయితే ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అన్నారు జీవన్ రెడ్డి.