రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ కిట్లను ఇవ్వడం మానేసింది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తన బర్త్ డే సందర్భంగా కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానికి వచ్చేలాగా చేసింది కేసీఆర్ కిట్ అన్నారు కేటీఆర్.
దేశంలో అతి తక్కువ బాలింతల, చిన్నారుల మరణాలు తెలంగాణలో నమోదు అవ్వడానికి కారణం కేసీఆర్ కిట్ అని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ఇలాంటి స్కీమ్‌ను ఆపేశారని తెలిపారు.
మరోవైపు కేటీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న ‘గిఫ్ట్ ఎ స్మైల్’ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. గిఫ్ట్ ఎ స్మైల్ తో పేద ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్ధిక సాయం చేశారు. ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొచ్చారు బీఆర్ఎస్ NRI US సెల్ కు చెందిన సంతోష్ రోకండ్ల.
ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రి కి రూ. 1,40,000 లు ఆర్ధిక సాయం అందజేశారు. మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న పేద ఎంబీబీఎస్ విద్యార్థి సింహాద్రి చదువు కోసం ఆర్ధిక సాయం అందించాలని కేటీఆర్ కి విజ్ఞప్తి చేయగా.. కేటీఆర్ పిలుపుమేరకు “గిఫ్ట్ ఎ స్మైల్” స్పూర్తితో ముందుకొచ్చారు సంతోష్.
Also Read:ధన్‌ఖడ్ రాజీనామాకు కారణం ఇదే!

