మంత్రి కేటీఆర్ తన బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన సేవాభావాన్ని చాటుకోనున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆపద్భాందవుడిలా ఆదుకుంటూ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్న కేటీఆర్…ఈసారి వికలాంగులకు అండగా నిలవనున్నారు.
తన పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా.. వంద మంది వికలాంగులకు మూడు చక్రాల ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. తన బర్త్‌డే సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొనాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సొంతంగా ఎవరికైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పుష్పగుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌లపై ఖర్చు పెట్టొద్దని కేటీఆర్ కోరారు.గతేడాది తన బర్త్‌డే సందర్భంగా కేటీఆర్.. తన సొంత ఖర్చులతో 6 అంబులెన్స్‌లను అందించారు. కేటీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి 90 అంబులెన్స్‌లను అందజేశారు.