ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆద్వర్యంలో లండన్‌లో టిఆర్ఎస్ కార్యనిర్వాహణ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను లండన్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్నారై తెరాస అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యవర్గ సభ్యులంతా కలిసి ముందుగా కేక్ కట్ చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. కేటీఆర్‌కు ఎన్నారై టీఆర్ఎస్ పక్షాన యావత్ ఎన్నారైల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.కేటీఆర్ గతంలో మంత్రిగా ఉండి దేశానికే ఆదర్శంగా నిలిచారని, ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం అసూయ పడే విధంగా తన బాధ్యతలు నిర్వహించారని, ఇలాంటి మంత్రి మాకుంటే బాగుండు అని నాతోనే ఇతర రాష్ట్రాల ప్రవాసులు అన్నారని తెలిపారు.
ఎన్నారై టీఆర్ఎస్ అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన ఎన్నో చేసుకోవాలని, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ పార్టీని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లని కోరారు.కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రమంతటా నూతన ఉత్తేజం వచ్చిందని క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, ఇటీవల ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వస్తున్న స్పందనే దానికి నిదర్శనమని సురేందర్ రెడ్డి తెలిపారు.
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకే ఆధ్యక్షుడు అశోక్ దూసరి మాట్లాడుతూ.. రాష్ట్ర పురోభివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ పురోభివృద్ది కృషి చేసి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి దిశగా తీసుకువచ్చారని కొనియాడారు. కేటీఆర్‌ను యువతరం ఆదర్శంగా తీసుకుంటోందన్నారు. ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణానికి కేటీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తెలంగాణకు ఐటీ కంపెనీలు తెచ్చేందుకు కేటీఆర్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.
కేటీఆర్ పిలుపు మేరకు “గిఫ్ట్ ఏ స్మైల్”లో భాగంగా మా సొంత గ్రామం పోచారంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతుల ఉండేలా వ్యక్తిగత ఖర్చుతో పనులు చేయించడానికి శ్రీకారం చుట్టామని, ఇక ఎవరు కూడా ప్రైవేట్ పాఠశాలలకి వెళ్లకుండా, కేవలం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే లాగ తీర్చిదిద్దుతామని తెలిపారు. కేటీఆర్ నాడు మంత్రిగా, నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాష్ట్రానికి చేస్తున్న సేవ చాలా గొప్పదని, మనంత ఎల్లపుడు వారి వెంటే ఉండి వారి నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు. చివరిగా కార్యక్రమానికి వచ్చిన కార్యవర్గసభ్యులకి స్థానిక ప్రవాసులకి కృతఙతలు తెలిపారు.
ఇలా మేమంతా గర్వపడేలా ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడు తెలంగాణలో ఉండడం మన అందరి అదృష్టమని, వారి పిలుపు మేరకు కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా స్థానికంగా మరియు తెలంగాణ రాష్ట్రంలో వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరై అన్ని సందర్భాలలో ప్రోత్సహాన్ని అందిస్తున్న ఎన్నారై టీఆర్ఎస్ అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డికి అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ పోచారం సురేందర్ రెడ్డి, అడ్వైసరి బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శులు సత్య చిలుముల మరియు సృజన్ రెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకులు రోహిత్ రావు, ముఖ్య నాయకులు రవి రేతినేని, శ్రీకాంత్ జెల్లా, సురేష్ బుడగం, గణేష్ పస్తం మరియు స్థానికులు నరేందర్, వాసు, రంజిత్ పాల్గొన్న వారిలో ఉన్నారు.