రాష్ట్ర కేబినెట్‌లో కీలకమంత్రిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఐటీ మినిస్టర్ కేటీఆర్ మరో ముందడుగు వేశారు. తన పుట్టినరోజు నాడు బొకేలు,ఫ్లెక్సీలతో హడావుడి చేయవద్దని ఆ రోజు హరితహారం కార్యక్రమం నిర్వహించాలని ఆయన అభిమానులకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 24న కేటీఆర్ పుట్టినరోజు జరుపుకోనున్న సంగతి తెలిసిందే.
తన పుట్టినరోజున హంగు ఆర్భాటాలకు డబ్బు వృథా చేయడం కంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొనడం ఉత్తమమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీల పుట్టినరోజులంటే ఇక చెప్పనక్కర్లేదు.. పూర్తిగా సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ దానికి భిన్నంగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోనూ ఫ్లెక్సీల విషయంలో ఇదే రకమైన ప్రకటన చేశారు. పర్యావరణ పరిరక్షణ ముఖ్యమంటూ.. ఫ్లెక్సీల ఏర్పాటు తగదని తెలిపారు. అంతేకాదు సిటీలోను, మున్సిపాల్టీల్లోను ఫ్లెక్సీల ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ మంత్రిగా హెచ్చరించారు. ఈ ఏడాది.. పుట్టినరోజును హరితహారంగా మార్చే ప్రయత్నం చేశారు కేటీఆర్.
Request TRS leaders NOT to waste money on Bouquets, Hoardings, Flexis or Advertisements on my birthday. Instead participate in #HarithaHaram
— KTR (@KTRTRS) July 19, 2017