- Advertisement -
ముఖ్రా (కె)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రైతులు తమ పంట పొలాలో తమ అభిమాన నాయకుడు కేటీఆర్ ఫోటోకి పుష్పాభిషేకం చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
ప్రతి జిల్లాలో ఐటీ టవర్ లు నిర్మించి, ఐటీ రంగంలో ఎన్నో కంపెనీలను తెలంగాణకు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలిపిన నాయకుడు కేటీఆర్ అని, అయన సుఖ సంతోషాలతో ఉండాలని రైతులు అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, రైతులు పాల్గొన్నారు.
Also Read:ఇంగ్లండ్‌తో టీమిండియా నాలుగో టెస్టు
- Advertisement -

