హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం చేసుకుందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.హైడ్రా కూల్చివేతల భయం కారణంగా కూకట్‌పల్లిలో ప్రాణాలు కోల్పోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అర్థం, పర్థం లేకుండా ఆనాలోచితంగా గుడ్డెద్దు చేలో పడినట్లు ఇష్టమొచ్చినట్లు కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కూల్చివేతలు చేశారు అన్నారు.
హైడ్రా అనే బ్లాక్‌మెయిల్ సంస్థను పేదల మీదకు ఉసిగొల్పి.. నోటీసులు ఇవ్వకుండానే మీ ఇళ్లు కూలగొడుతామంటూ భయానక వాతావారణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందన్నారు. పిల్లలు పుస్తకాలను తీసుకుంటామంటే కూడా తీసుకొనివ్వకుండా పేదల ఇళ్లు కూలగొడుతున్నారు… ఎక్కడ నా ఇల్లు కూలగొడుతారమోనని 52 ఏళ్ల బుచ్చమ్మ అనే మహిళ మూడు రోజులు ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నారు.
వాళ్ల కుటుంబాన్ని చూస్తే బాధనిపిస్తోంది. ఎంతో కష్టపడి మా బిడ్డలకు ఉపయోగపడతదని ఇళ్లు కట్టామని బుచ్చమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు… ఆలోచన, ప్రణాళిక, పద్దతి లేకుండా చేశారు. వాళ్లే పర్మిషన్లు ఇచ్చి ట్యాక్స్ కట్టించుకొని వాళ్లే ఇల్లు కూలగొడుతారంట అన్నారు. హైడ్రా అనే సంస్థ కారణంగానే బుచ్చమ్మ బలవన్మరణం పొందారు… ఇది ఆత్మహత్య కాదు. హైడ్రా అనే అరాచక సంస్థతో రేవంత్ రెడ్డి చేయించిన హత్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:KTR: దీపావళికి రైతులు దివాళా తీయడమేనా?
మీ దిక్కుమాలిన చర్యల కారణంగా పేదలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి… వేదశ్రీ అనే పాప ఏడుస్తూ పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇళ్లు కూలగొట్టారుఅన్నారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించాలా?, ఈ రాష్ట్రంలో పేద వాళ్లకు మాత్రమే చట్టాలున్నాయా? రేవంత్ రెడ్డి నీ అన్నకు మాత్రం ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఇల్లుకు నోటీసులిస్తారా? అని ప్రశ్నించారు. పేదవాళ్లు పుస్తకాలు తీసుకుంటామంటే కూడా తీసుకోనివ్వకుండా ఇల్లు కూల్చటమనేది ఇంతకంటే దిగజారిన, దిక్కుమాలిన చర్య ఏదైనా ఉంటుందా? అన్నారు.