హరితహారం ప్రపంచానికే ఆదర్శం..

281
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఘట్‌కేసర్ మండలం పోచారం ఇన్పోసిస్‌ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ఉద్యోగులు ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలను ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలను చేపట్టిందన్నారు.

హారిత హరం ద్వారా ఐదేళ్లలో 213 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 60 శాతం చెరువుల్లో పుడిక తీశామన్నారు. వరంగల్లో ఇన్ఫోసిస్ బ్రాంచ్ ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు మంత్రి కేటీఆర్. 3300 మెగావాట్లతో సౌర విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే తొలిస్థానంలో ఉన్నామని తెలిపిన కేటీఆర్‌ హైదరాబాద్‌లో త్వరలో 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామన్నారు.

ktr

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవే ఏడాదిన్నరలోగా పూర్తి చేస్తామని తెలిపారు. చెన్నై వాతావరణం, బెంగళూరు ట్రాఫిక్‌తో పోలిస్తే ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ ఎదుగుతోందని తెలిపారు. ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగిస్తున్నామని చెప్పారు.

- Advertisement -