అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్..

136
ktr
- Advertisement -

హైదరాబాద్‌లో నిర్వహించిన భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ పారిశ్రామికవేత్తలకు టీ-ప్రైడ్ పథకం కింద ‘బెస్ట్ పెరఫార్మింగ్ ఎంటర్‌ప్రైజ్’ అవార్డులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా పీవీ మార్గ్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేద్క‌ర్ కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ చివ‌రి నాటికి ఈ విగ్ర‌హాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్క‌రించ‌బోతోంద‌న్నారు.

భార‌త‌దేశం మొత్తం గ‌ర్వ‌ప‌డే విధంగా మ్యూజియం, జ్ఞానమందిరం ఏర్పాటు చేస్తున్నాం. ఇది భ‌విష్య‌త్ త‌రాల‌కు ఆద‌ర్శంగా నిలవ‌బోతుంద‌న్నారు. అంబేద్క‌ర్ త‌త్వాన్ని మాటల్లో చాలా మంది చెప్తారు. కానీ ఆ త‌త్వాన్ని కేసీఆర్ ఆక‌ళింపు చేసుకుని ముందుకు సాగుతున్నారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్య‌మైంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ మ‌హానుభావుడు అంబేద్క‌రే కార‌ణ‌మ‌ని కేటీఆర్ చెప్పారు.

- Advertisement -