ఉప్పల్ ఎమ్మెల్యేను అభినందించిన కేటీఆర్..

6
- Advertisement -

ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని అభినందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎంబీబీఎస్ విద్యార్థిని చదువుకి ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలబడ్డారు లక్ష్మారెడ్డి.

చర్లపల్లి డివిజన్ మధుసూదన్ రెడ్డి కాలనీకి చెందిన లింగోజీ రమేశ్ – మంగమ్మ కుమార్తె తేజ శ్రీ కొత్తగూడం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి తన సొంత నిధులతో బీఎల్‌ఆర్‌ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంబీబీఎస్‌కి అయ్యే ఫీజు 29,000 రూపాయల చెక్కును బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేతుల మీదుగా చెక్కును అందజేశారు.

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఎవరైనా ఎంబీబీఎస్ సీటు సాధిస్తే ఫీజు మొత్తం తానే చెల్లిస్తామని ఆయన తెలిపారు.

Also Read:Pawan:పారదర్శక పాలన అందిస్తున్నాం

- Advertisement -