జగిత్యాలకు కోకాకోలా, పెప్సీ కంపెనీలు తీసుకొచ్చి మేలు చేస్తామన్నారు మంత్రి మంత్రి కేటీఆర్. జగిత్యాల జిల్లాలో ఎస్పీ కార్యాలయం, డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. జగిత్యాల ప్రజలకు అందుబాటులో అధునాత సదుపాయాలతో కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు నిర్మించుకుని ప్రారంభించుకున్నాం అన్నారు.
రాష్ట్రంలో అతిపెద్ద డబుల్ బెడ్రూం కాలనీ జగిత్యాల నియోజకవర్గంలోనే ఉందని…కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్‌కు తేడా ఏందంటే.. నూకపల్లిలో కేసీఆర్ నగర్‌కు పోయేటప్పుడు నాలుగైదు డబ్బా ఇండ్లు కనబడుతాయి. కాంగ్రెస్ పాలనకు ఆ డబ్బా ఇండ్లు నిదర్శనం. కేసీఆర్ పని తీరుకు ఆ డబుల్ బెడ్రూం ఇండ్లు నిదర్శనం అన్నారు.
ఇది వరకు ఇక్కడ పని చేసిన వ్యక్తులు, మంత్రిగా పని చేశారని… ఒక మంత్రిగా ఉన్నప్పుడు కానీ పనులు.. ఎమ్మెల్యేగా సంజయ్ చేసి చూపించారన్నారు. కలెక్టర్‌ను, ఎస్పీని మీ ముందుకే తీసుకొచ్చాం. కరీంనగర్‌కు పోవాల్సిన అవసరం లేదన్నారు.. డాక్టర్‌గా సంజయ్ ఎన్ని సేవలు చేశాడో మీకు బాగా తెలుసు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. బ్రహ్మాండమైన సేవ చేశారు. మంచి పేరు ఉంది కాబట్టి కేసీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారన్నారు.
Also Read:ట్రైలర్ టాక్ : ‘టైగర్ నాగేశ్వరరావు’ కుమ్మేశాడు