రామ్ తో బోల్డ్ బ్యూటీ రొమాన్స్

23
- Advertisement -

రామ్ పోతినేని హీరోగా, పూరీ దర్శకత్వంలో వ‌స్తున్న డ‌బుల్ ఇస్మార్ట్ సినిమా గురించి ఇప్పుడో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలోని స్పెష‌ల్ సాంగ్‌కు త‌మిళ బ్యూటీ యషిక ఆనంద్ చిందులేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో య‌షిక్ ఫుల్ బోల్డ్ లుక్స్‌లో క‌నిపించి, కుర్రాళ్ల‌ను క‌నువిందు చేయ‌నుంద‌ట‌. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మ‌ణిశ‌ర్మ‌ని ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం.

మొద‌ట్లో ఈ సినిమా కోసం వేరే మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను అనుకున్న‌ప్ప‌టికీ మ‌ణిశ‌ర్మ అయితేనే న్యాయం చేయ‌గ‌లడ‌ని భావించి త‌న ఓటును పూరీ, మ‌ణిశ‌ర్మ‌కే వేశాడట‌.సరే ఏది అయితే ఏం.. ఈ సినిమా పూరి కెరీర్ లోనే చాలా కీలకం కానుంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి గొప్ప పేరు ఉన్నా.. లైగర్ సినిమాతో ఆ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఆర్ధికంగా కూడా పూరి పూర్తిగా నష్టాల్లో ఉన్నాడు. ఇప్పటికీ లైగర్ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ తో పూరికి లైగర్ సినిమా తాలూకు లెక్కలు తెగలేదు.

వారంతా పూరితో గొడవకు కూడా సిద్ధంగా ఉన్నారు. సో.. లైగర్ తో తమకు జరిగిన భారీ నష్టాలను డ‌బుల్ ఇస్మార్ట్ తీరుస్తాడని అందరూ భావిస్తున్నారు. అటు పూరి కూడా ఈ సినిమా పై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు. ముఖ్యంగా డ‌బుల్ ఇస్మార్ట్ మూవీ ఛార్మికి చాలా కీలకం. పూరి – ఛార్మి బంధం కంటిన్యూ కావాలి అన్నా.. ఎట్టి పరిస్థితుల్లో డ‌బుల్ ఇస్మార్ట్ భారీ విజయం సాధించాలి. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Also Read:ట్రైలర్ టాక్ : ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ కుమ్మేశాడు

- Advertisement -