తన్నిన వాడిపై తడాఖా చూపాలన్న కేటీఆర్‌

343
KTR angry over santhosh for cheating jobs
- Advertisement -

సూర్యపేట జిల్లా జిల్లీలో ఈదునూరి సంతోష్ టీఆర్ఎస్ నేత పేరుతో స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద నుండి డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవటంతో సంతోష్ ను బాధితులు ప్రశ్నించారు. దీంతో వారిని గదిలో బంధించి దాడికి పాల్పడ్డాడు. అయితే, సంతోష్‌ టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన వ్యక్తంటు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు.

సదరు యువకులపై దాడికి పాల్పడిన సంతోష్ అనే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ సభ్యుడు కాదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కూడా ధృవీకరించారని అన్నారు. యువకులపై దాడికి పాల్పడిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించినట్లు చెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ సైతం సంతోష్‌కు టీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదని…కావాలనే కొంతమంది బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంతోష్‌పై చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారని….అధికార పార్టీ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లికి చెందిన సంతోష్ మంత్రి జగదీష్ బంధువునంటూ స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి వద్ద నుండి డబ్బులు వసూలు చేశారు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవటంతో సంతోష్ ను బాధితులు ప్రశ్నించారు. దీంతో వారిని గదిలో బంధించి దాడికి పాల్పడ్డాడు. సంతోష్ బాధితులపై దాడి చేసిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాధితులకు బూతులు తిడుతూ కాళ్ళతో తన్నుతూ అరాచకానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందిస్తే ఎవ్వర్నీ బ్రతకనివ్వనని సంతోష్ బాధితులకు భయాందోళనలకు గురిచేశాడు. అంతేకాదు సంతోష్ తన కాళ్ల ఎదురుగా కింద కూర్చున్న యువకులను చాతిపై తన్ని, బండ బూతులు తిట్టాడు. రివాల్వర్ తీసుకురండిరా అంటూ తన అనుచరులను ఆదేశించేసరికి ఆ ఇద్దరు యువకులు భయోత్పాతానికి గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.దీంతో సంతోష్ బాగోతం భయటపడింది.

https://youtu.be/_v6zOTNPuFM

- Advertisement -