ప్రభాస్‌కు శత్రువు.. స్నేహితుడు.. ఒక్కడే !

244
- Advertisement -

బాహుబలి 2తరువాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో సినిమా చెయ్యనున్నాడు. ఇది భారీ బడ్జెట్ తో పాటు భారీ యాక్షన్ తో కూడిన చిత్రమని చెబుతున్నారు. ఈ సినిమాలో హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేశ్ కవలలుగా డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారట.

Prabhas-Sujith-Movie-happen

అందులో ఒకటి విలన్ పాత్ర, మరొకటి పాజిటివ్‌గా ఉండే హీరో స్నేహితుడి పాత్ర అని తెలుస్తోంది. ఇద్దరిలో విలన్ ఎవరో? స్నేహితుడు ఎవరో? ప్రభాస్ తెలుసుకునే సన్ని వేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో యూవీ క్రియేషన్స్ నిర్మించే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో డ్యూయల్ రోల్ చేయడానికి నీల్ నితిన్ ముఖేశ్‌ను సంప్రదించారట నిర్మాతలు.

250790,xcitefun-neil-nitin-mukesh-5

దీంతో ఆయన ఈ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలపై పట్టు సాధించే పనిలో ఉన్నాడట. ఇప్పటికే నీల్ నితిన్ తమిళ కత్తిలో విలన్ పాత్ర చేశాడు. తెలుగు ఆయనకు ఇది తొలిచిత్రం కాగా..దక్షిణాదిలో రెండో సినిమా. ఇక ఈ మూవీ జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

- Advertisement -