మేడిగడ్డ బ్యారేజీ ఘటనల తర్వాత ఇప్పుడు అన్నారం బ్యారేజీ చుట్టూ జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్‌పై ఇప్పటికే అనేక వివాదాలు ఉన్న సమయంలో అన్నారం బ్యారేజ్ వద్ద భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరగడం ప్రమాదకరమని అన్నారు.
బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు నిషేధమన్న నిబంధనలను ఉల్లంఘించడం తీవ్రమైన తప్పిదమని, దీనిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యారేజీ పిలర్ల సమీపంలో తవ్వకాలు చేయడం వల్ల నిర్మాణం బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేలా కుట్ర జరుగుతోందని ఆరోపించిన కేటీఆర్, రాష్ట్ర వనరులను దోపిడీ చేసే ప్రయత్నాలు ఆపాలని హెచ్చరించారు. బ్యారేజీలకు ఏదైనా నష్టం జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను కాపాడే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read:బుర్జ్ ఖలీఫా భవనానికి మంటలు

